Friday, February 8, 2013

ఏకశ్లోకీ - భావ సహితం




శ్రీ గురుభ్యోనమః

కిం జ్యోతిస్తవ భానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం
స్యాదేవం రవిదీపదర్శనవిధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే,
చక్షుస్తస్య నిమీలనాదిసమయే కిం ధీర్ధియోదర్శనే
కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో.
ఇతి శ్రీ శఙ్కర భగవత్పూజ్యపాద విరచితా ఏక శ్లోకీ

తాత్పర్యము:
గురువు శిష్యుల సంభాషణము
గురువు: వత్సా ! ప్రకాశవమ్తమైన ఆజ్యోతి యేది అని నీవనుకుంటున్నావు?
శిష్యుడు: ఆర్యా పగలు సూర్యుడు, రాత్రి ప్రదీన చంద్రాదులు
గురువు: ఐన సూర్య చంద్రులను గుర్తించు జ్యోతి ఏది?
శిష్యుడు: నేత్రము (కళ్ళు)
గురువు: కళ్ళు మూసికొన్నప్పుడేది కనపడు జ్యోతి ఏది?
శిష్యుడు: బుద్ధి
గురువు: బుద్ధిని చూచు జ్యోతి ఏది?
శిష్యుడు: నేను, అనగా ఆత్మ. ప్రభో (భవాన్)!మీరు, నేను పరం జ్యోతి స్వరూపమగు ఆత్మయే అని తెలిసినది.
జయ జయ శంకర హర హర శంకర




No comments:

Post a Comment