మనోనివృత్తిః పరమోపశాన్తిః, నతీర్థవర్యా మాణికర్ణికాత్ర !
జ్ఙాన ప్రవాహా విమలాదిగఙ్గా, స కాశికాహం నిజబోధరూపా !! (౧)
యస్యామిదం కల్పితమిన్ద్రజాలం, చరాచరం భాతి మనోవిలాసమ్ !
సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా స కాశికాహం నిజబోధరూపా !!
కోశేషు పఞ్చస్వధిరాజమానా, బుద్ధిర్భవానీ ప్రతి దేహగేహమ్ !
సాక్షీ శివః సర్వగతోన్తరాత్మా, సా కాశికాహం నిజబోధరూపా !!
కాశ్యాం హి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశికా !
సా కాశీ విదితా యేన తేన ప్రాప్తికా కాశికా !!
కాశీ క్షేత్రం శరీరం త్రిభువనజననీ వ్యాపినీ జ్ఙానగఙ్గౌ
భక్తిః శ్రద్ధా గమేయం నిజగురుచరణ ధ్యానయోగః ప్రయాగః!
విశ్వేశోయం తురీయఃసకలజనమనఃసాక్షిభూతోన్తరా త్మా
దేహే సర్వం మదీయే యది వసతి పునస్తీర్థమన్యత్ కిమస్తి!!
ఇతి శ్రీ శఙ్కర భగవత్పూజ్యపాద విరచిత కాశీపఞ్చకమ్
ఇది శ్రీ శఙ్కర భగవత్పూజ్యపాదుల చే విరచితమైన కాశీ పంచకము.
జ్ఙాన ప్రవాహా విమలాదిగఙ్గా, స కాశికాహం నిజబోధరూపా !! (౧)
ఎక్కడ మనోవృత్తిపూరకమగు పరమకాంతి వెలయుచున్నదో, అక్కడనే తీర్థములలో శ్రేష్ఠమైన మణికర్ణిక , జ్ఙాన ప్రవాహముతో కూడిన ఆది గంగతో వెలయునట్టి కాశీ క్షేత్రమును సృష్టించుచున్నది. బోధ కూడ ఇట్టిదే, బోధ స్వరూపుడనైన నేనే కాశికా స్వరూపుడను!
యస్యామిదం కల్పితమిన్ద్రజాలం, చరాచరం భాతి మనోవిలాసమ్ !
సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా స కాశికాహం నిజబోధరూపా !!
దేనిలో మనస్సు యొక్క విలాసము, ఇంద్రజాలములు (మాయ) అని ఈ కల్పిత ప్రపంచము విలాసముగనున్నదో, ఏది సత్ చిత్ సుఖ స్వరూపమో, ఏకము, పరమాత్వ స్వరూపము, ఆ ప్రకాశ స్వరూపము అయ్యున్నదో ఆ బోధ స్వరూపుడనైన నేనే కాశికా స్వరూపుడను!
కోశేషు పఞ్చస్వధిరాజమానా, బుద్ధిర్భవానీ ప్రతి దేహగేహమ్ !
సాక్షీ శివః సర్వగతోన్తరాత్మా, సా కాశికాహం నిజబోధరూపా !!
పంచకోశములలోను వ్యాపించి ప్రతిదేహమును తన గృహముగా మార్చుకొనిన బుద్ధియే భవాని. అంతరాత్మ, సర్వగతుడు, సాక్షి ఐనవాడే శివుడు. ఈ ఉభయులూ కలిసిన క్షేత్రము కాశిక. ఆ బోధ స్వరూపుడనైన నేనే కాశికా స్వరూపుడను!
కాశ్యాం హి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశికా !
సా కాశీ విదితా యేన తేన ప్రాప్తికా కాశికా !!
కాశికయందే (ఆత్మజ్ఙానమునందే) కాశిక ప్రకాశించును, ఈ జ్ఙానరూపమగు కాశికయే అన్నిటినీ ప్రకాశింప
చేయుచున్నది. ఈ జ్ఙాన స్వరూప కాశికను ఎరిగిన వానికే కాశీ ప్రాప్తి.
కాశీ క్షేత్రం శరీరం త్రిభువనజననీ వ్యాపినీ జ్ఙానగఙ్గౌ
భక్తిః శ్రద్ధా గమేయం నిజగురుచరణ ధ్యానయోగః ప్రయాగః!
విశ్వేశోయం తురీయఃసకలజనమనఃసాక్షిభూతోన్తరా
దేహే సర్వం మదీయే యది వసతి పునస్తీర్థమన్యత్ కిమస్తి!!
త్రిభువన జననియైన జ్ఙానగంగయే ప్రవాహము, ఈ శరీరమే కాశిక్షేత్రము,భక్తి శ్రద్ధలే గయ, నిజ గురుచరణ ధ్యాన యోగమే ప్రయాగ, తురీయమే విశ్వేశ్వరుడు, ఈయనయే అంతరాత్మ, సకల జన మనస్సాక్షి, ఈ సర్వమూ నా శరీరమునందే ఉన్నవి ఈ నేనే కాశికా స్వరూపుడను. ఇక వేరు తీర్థములు ఎందుకు.
ఇతి శ్రీ శఙ్కర భగవత్పూజ్యపాద విరచిత కాశీపఞ్చకమ్
ఇది శ్రీ శఙ్కర భగవత్పూజ్యపాదుల చే విరచితమైన కాశీ పంచకము.
No comments:
Post a Comment