శ్రీ గురుభ్యోన్నమః
శ్రీ గణేశాయ నమః
సదాశివ సమారంభాం శంకరాచార్యమధ్యమాం!
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం!!
శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం !
నమామి భగవత్పాద శంకరం లోకశంకరం !!
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్
(-వివిధ వ్యాఖ్యానములు, పుస్తకములనుండి సంకలనము చేయబడినది)
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
శరీరం సురూపం తథా వా కలత్రం
యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యమ్ !
మనశ్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ !! ౧
భావము: అందమైన శరీరము, రూపవంతురాలగు భార్య, ఎంతో చిత్రమైన గొప్పదైన కీర్తి, మేరు సమానమైన ధనము ఉన్నా, మనస్సు శ్రీ గురుచరణముల పాద పద్మముల చెంత లగ్నము చేయలేనప్పుడు ఎన్ని ఉన్నా ఏమి లాభము?
కలత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం
గృహం బాంధవాః సర్వమేతద్ధి జాతమ్ !
మనశ్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ !! ౨
భావము: భార్య, ఐశ్వర్యము, పుత్ర పౌత్రాది సర్వస్వము ఉండినను, గృహము, బంధువులు, మొదలగున్నవి అన్నీ కలిగియున్నా, మనస్సు శ్రీ గురుచరణముల పాద పద్మముల చెంత లగ్నము చేయలేనప్పుడు ఎన్ని ఉన్నా ఏమి లాభము?
షడఙ్గాదివేదో ముఖే శాస్త్రవిద్యా
కవిత్యాది గద్యం సుపద్యం కరోతి !
మనశ్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ !! ౩
భావము: శిక్షా, కల్ప, వ్యాకరణము, నిరుక్త, ఛన్దో, జ్యోతిష్యములను ఆరు అంగములు, నాలుగు వేదములు, శాస్త్రములు కంఠస్తము చేసి, ఇతర విద్యలు, గద్య పద్యములు మరియు కవిత్వములు హేలగా చెప్పగలిగినప్పటికీ, మనస్సు శ్రీ గురుచరణముల పాద పద్మముల చెంత లగ్నము చేయలేనప్పుడు ఎన్ని ఉన్నా ఏమి లాభము?
విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః
సదాచారవృత్తేషు మత్తో న చాన్యః !
మనశ్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ !! ౪
భావము: విదేశములందు సన్మానము పొందినా, స్వదేశములో ఎంతో ఖ్యాతి గడించినా, ఆచారమునందు ఇంకొకరు సాటిరాకున్నను, మనస్సు శ్రీ గురుచరణముల పాద పద్మముల చెంత లగ్నము చేయలేనప్పుడు ఎన్ని ఉన్నా ఏమి లాభము?
క్షమామణ్డలే భూప భూపాలబృన్దైః
సదా సేవితం యస్య పాదారవిందమ్ !
మనశ్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ !! ౫
భావము: సమస్త భూమండలములోని రాజులు, చక్రవర్తులు, మొదలగువారు పాద దాసులై ఎల్లవేళలా కొలుస్తున్నా, మనస్సు శ్రీ గురుచరణముల పాద పద్మముల చెంత లగ్నము చేయలేనప్పుడు ఎన్ని ఉన్నా ఏమి లాభము?
యశో మే గతం దిక్షు దాన ప్రతాపాత్
జగద్వస్తు సర్వం కరే యత్ ప్రసాదాత్ !
మనశ్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ !! ౬
భావము: "దాన వీరుడనని, నా కీర్తితో దిక్కులు నిండిపొయాయని, ప్రపంచములో అన్ని గొప్ప వస్తువులు నా చేత చిక్కాయని" భవించినా, మనస్సు శ్రీ గురుచరణముల పాద పద్మముల చెంత లగ్నము చేయలేనప్పుడు ఎన్ని ఉన్నా ఏమి లాభము?
న భొగో న యోగో న వా వాజిరాజౌ
న కాన్తాసుఖే నైవ విత్తేషు చిత్తమ్ !
మనశ్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ !! ౭
భావము: యోగము లేదు! భోగము లేదు! రాజ్యము, గజములు, అశ్వములు, పరివారములవంటి ఏ కొర్కె లేదు! కాంత మరియు కనకములపైన ఆసక్తి లేదు! ఐనను మనస్సు శ్రీ గురుచరణముల పాద పద్మముల చెంత లగ్నము చేయలేనప్పుడు ఎన్ని ఉన్నా ఏమి లాభము?
అరణ్యే న వా స్వస్య గేహే న కార్యో
న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే !
మనశ్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ !! ౮
భావము: "గృహస్తాశ్రమము - వానప్రస్తము మీద కోర్కె లేదు! ఏకార్యమునందు కోరిక, ఇష్టము లేదు! శరీర భోగములకు మనస్సు సిద్ధముగాలేదు మరియు వాటిని ఇష్టపడుటలేదు, దీని ఆవల నున్న గొప్పదానిని పొందగోరుచున్నాను" అని పలుకు వారి మనస్సు శ్రీ గురుచరణముల పాద పద్మముల చెంత లగ్నము చేయలేనప్పుడు ఎన్ని ఉన్నా ఏమి లాభము?
అనర్ఘ్యాణి రత్నాని భుక్తాని సమ్యక్
సమాలిఙ్గితా కామినీ యామినీషు !
మనశ్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ !! ౯
భావము: వెలకట్టలేని రత్నములు దొరికినవి, సుఖవంతమైన భుక్తి లభించినది, యామినులందు (రాత్రులందు) కామినులైన కాంతల ఆలింగన సుఖము లభించి మనస్సు ఆనందముగా ఉన్నది, అయిన ఏమి? మనస్సు శ్రీ గురుచరణముల పాద పద్మముల చెంత లగ్నము చేయలేనప్పుడు ఎన్ని ఉన్నా ఏమి లాభము?
గురోరష్టకం యః పఠేత్ పుణ్యదేహీ
యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహే !
లభేత్ వాఙ్చితార్థం పరం బ్రహ్మసంఙ్ఞః
గురోరుక్త వాక్యా మనో యస్య లగ్నమ్ !! ౧౦
భావము: యతి, భూపతి, బ్రహ్మచారి, గృహస్తు - ఎవరైనా సరే, ఈ గురు అష్టకము చదివేవారు పుణ్యపురుషులే. గురు వాక్యమున విశ్వాసము కలవారికి అన్ని కోర్కెలు తీరి, అన్నిటికన్నా గొప్పనైన పరబ్రహ్మము యొక్క సంఙ్ఞ పొందగలడు ( బ్రహ్మమును గూర్చి తెలుసుకొనగలడు).
-ఇతి శ్రీ శఙ్కర్భగవ్పూజ్యపాద విరచిత గుర్వష్టకమ్ సంపూర్ణం-
-ఇది శ్రీ శంకరాచార్య కృతమైన గుర్వష్టకము ఆంధ్రానువాదము-
పైన తెలిపిన భావములు మరియు వివరణలు అన్నీ పెద్దల, పండితుల, విజ్ఞుల మరి ఎందరో మహానుభావుల అభిప్రాయములు. ఇది మీకు నచ్చి ఉంటే ఖ్యాతి వారిది. అర్ధం చేసుకోవడంలో కాని, సంకలనం చేయడంలో కాని, ఎవైనా పొరపాట్లు, తప్పులు లేదా అప్పు తచ్చులు ఉంటే ఆ బాధ్యత నాది, సరి దిద్దుకొనే అవకాశాన్ని ఇచ్చి మార్పులు నా కు తెలుపగలరు.
సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు
ఓం శాంతి: శాంతి: శాంతి:
No comments:
Post a Comment