Tuesday, February 26, 2013

శ్రీ దక్షిణామూర్త్యష్టకం


శ్రీ గురుభ్యోన్నమః

విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా
యః సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే !! !!

బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాఙ్నిర్వికల్పం పునః
మాయాకల్పితదేశకాలకలనావైచిత్ర్యచిత్రీకృతమ్
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే !! !!

యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థగం భాసతే
సాక్షాత్తత్త్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్
యత్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే !! !!

నానాచ్ఛిద్రఘటోదరస్థితమహాదీపప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిః స్పందతే
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే !! !!

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం శూన్యం విదుః
స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః
మాయాశక్తివిలాసకల్పితమహావ్యామోహసంహారిణే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే !! !!

రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయాసమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోపసంహరణతో యోzభూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే !! !!

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతః స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే !! !!

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః
స్వప్నే జాగ్రతి వా ఏష పురుషో మాయాపరిభ్రామితః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే !! !!

భూరంభాంస్యనలోనిలోంబరమహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే !! !!

సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మింస్తవే
తేనాస్య శ్రవణాత్తదర్థమననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్
సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతమ్ !! ౧౦ !!

శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-06

ఈ క్రింది లంకె ద్వారా ముందటి భాగాన్ని చూడగలరు

శ్లో5!! కాలాంబుదాళి లలితోరసి కైటభారేర్

ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ !

మాతస్ సమస్త జగతామ్ మహనీయ మూర్తిర్

భద్రాణి మే దిశతు భార్గవ నందనాయా: !!

తా : మబ్బు మధ్యలో మెఱయు మెఱుపు వలె విష్ణుమూర్తి యొక్క నీలమేఘ సన్నిభమైన వక్ష:స్థలమునందు విలసిల్లు మహనీయ మూర్తి, సకల జగన్మాత, శ్రీ మహాలక్ష్మీ భగవతి నాకు సమస్త శుభములను గూర్చు గాక !

వివరణ: శంకరులు ఇక్కడ శ్రీ హరిని కైటభారే అని సంబోధించారు, ఇక కైటభారే అన్న విషయానికొస్తే, మధు కైటభులనే రాక్షసులను శ్రీ మహావిష్ణువు సృష్టి ఆరంభంలో సంహరించారు. మధు కైటభులు ఇద్దరూ సోదరులు, వారెవరో కాదు, మధువు=నేను; కైటభుడు=నాది అనే గుణాలు. నాది అనేటప్పటికి మనం మన చేతులను గుండెలమీదపెట్టి నాది అంటాం. అటువంటి గుణానికి ప్రతినిధి ఐన కైటభుని సంహరించినవాడు శ్రీ హరి. అంటే అటువంటి గుణమునకు శత్రువు అని అంతర్లీనంగా కైటభ వృత్తాంతాన్ని పొందు పరిచారు శంకరులు.

అంతేకాక కాలాంబుదాళి అన్న పద ప్రయోగం ద్వారా భగవంతుని కురవడానికి సిద్దంగా ఉన్న నల్లనిమేఘంతో పోలిక వేశారు. శ్రీహరిని నీల మేఘ శ్యాముడని పిలుస్తారు, కురవడానికి సిద్దముగా ఉన్న మేఘం, మీన మేషాలు లెక్కపెట్టదు, ఎవరున్నారు ఎవరు లేరు చూడదు, దాహార్తి తో ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు కదా ఒక్కడికే కురుద్దామని మేఘము ఆలోచించదు. ఒక్కపెట్టున తన దగ్గరున్నదంతా కురిసేసి వెళ్ళిపోతుంది. అటువంటి శ్రీహరి లలితమైన హృదయం కలవాడు. కారుణ్యమనే నీటితో నిండిన నల్ల మబ్బు గుండెలో దాక్కుని ఒక్కసారిగా స్ఫురించిన మెరుపు తీగ/ తటిల్లత/ బంగారు తీగ శ్రీ మహాలక్ష్మి. మెరుపు తీగతో కూడిన నల్లని మబ్బులు జనులందరకూ ఆహ్లాదకారకములెలాగో, అలా ఒకరిలో ఒకరైన మీ ఇద్దరి దర్శనము మాకు భద్రము చేయుగాక. అమ్మా మెరుపు తీగ స్వరూపమైన నువ్వు ఒక్కసారి మాపై దయతో మెరిసి కనిపిస్తే, మెరుపులో మేఘ స్వరూపమైన భగవంతుని చూపించే కారుణ్యమున్న దానవు (అంటే అమ్మ దయ ఉంటే అయ్యవారి దర్శనం చేయిస్తుంది అన్న భావన, భగవంతుని సౌందర్య దర్శనము చేయించినది అమ్మ. అంతేకదా!). అమ్మా నువ్వు అందరకూ తల్లివి కదా మరి అమ్మవైన నువ్వు ఇలా కష్టపడుతున్న బీద బ్రాహ్మణ కుటుంబాన్ని ఉద్దరించాలికదా. అమ్మా అంత కారుణ్యమున్న భగవంతుని గుండెలలో ఉన్న దానవు నువ్వు. అమ్మా భగవంతుని కారుణ్యము, ఔదార్యము నువ్వే కదా. అలా వీరిని ఉద్దరించగలిగిన శక్తిగా ఆయన గుండెలలో ఉన్నది నువ్వే కదమ్మా!

సందర్భం ప్రకారం: పూర్వ జన్మలలోఅలా నాది నాది అని గుండెలమీదనే చెయ్యిపెట్టుకుని చెయ్యిని తిరగేసి దాన ధర్మాలు చేయలేదు కనకనే బీద బ్రాహ్మణ కుటుంబానికి ఇప్పుడు దరిద్రం ఉన్నది అటువంటి దరిద్రాన్ని తొలగతోసే మేఘ స్వరూపమైన భగవంతుని కారుణ్యం ఇక్కడ కురవాలంటే భగవంతుని దర్శనం చేయించగలిగి, ఆయన గుండెలలో ఉండే నువ్వు ఒక్క సారి కారుణ్యాన్ని వర్షింపజేయి. బీదబ్రాహ్మణి అమ్మతనంతో నాకు ప్రేమతో ఒక అమ్మలా భిక్ష వేసింది. అమ్మ తనానికే పరాకాష్ట నువ్వు. అన్ని జగములకూ అమ్మవు నువ్వు. అమ్మా మరి అమ్మ ఇచ్చిన భిక్షను నేను సంతోషం తో స్వీకరించాలంటే మరి అమ్మ కష్టాన్ని తీయలేవా. ఎంత కారుణ్యముంటే నువ్వు భృగుమహర్షికి కూతురిలాపుట్టావు తల్లీ. అంత కారుణ్యమున్న మీరిరువురూ ఒక్కసారి కారుణ్యామృత చూపులు ఒక్కసారి మెరుపు మెరిసినట్టుగా ప్రసరిస్తే వీరి దారిద్ర్యం తొలగిపోతుంది.