శ్రీ గురుభ్యోనమః
నమస్తే
{ మాయా పఞ్చకమ్}
నిరుపమనిత్యనిరంశకేఽప్యఖణ్డే
మయి చితి సర్వవికల్పనాదిశూన్యే
ఘటయతి జగదీశజీవభేదం
త్వఘటితఘటనాపటీయసీమాయా
నిత్యుణ్ణి, నిరుపముణ్ణి, నిర్ అంశుణ్ణి అఖండుణ్ణి స్వయం జ్ఙానస్వరూపుణ్ణి ఐన నాయందు ఈ మాయ
అజ్ఞానమును కలిగించి, జగత్తు, ఈశ్వరుడు, జీవుడు అను భేదాన్ని కలిగిస్తోంది. ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని
ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది.?
శ్రుతిశతనిగమాన్తశోధకాన
ప్యహహ ధనాదిదర్శనేన సద్యః
కలుషయతి చతుష్పదాద్యభిన్నాన్
త్వఘటితఘటనాపటీయసీమాయా
వేదవాక్యములతోనూ, ఉపనిషద్ సూక్తులతోనూ
ప్రభోధముచేసి చతుష్పాదులైన పశుపక్షాదులు జంతువులనుండి వేరుగా సంస్కరింపజేసినా కూడా
! ఆహా ఈ మాయ గొప్పదనమేమో..వారికి వెంటనే భోగింపదగు ధనమాదిగా సమస్త వస్తువులను
చూపించి అవి పొందడం పోగొట్టుకోవడం అనే విషయములచే కలుషితులను కావిస్తోంది. ఈ మాయ
ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది.?
సుఖచిదఖణ్డవిబోధమద్వితీయం
వియదనలాదివినిర్మితే నియోజ్య
భ్రమయతి భ్రమసాగరే నితాన్తం
త్వఘటితఘటనాపటీయసీమాయా
అఖండ సచ్చిదానంద సుఖబోధస్వరూపమైన ఆత్మను ఈ మాయ ఆకాశాది పంచభూతనిర్మితమగు ఈ
భవసాగరములో పడేసి, నిరంతరమూ కొట్టుకునేటట్టు
చేస్తోంది.ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని
ప్రదర్శిస్తోంది.?
అపగతగుణజాతివర్ణభేదే
సుఖచితి విప్రవిదాద్యహఙ్కృతిం చ
స్ఫుటయతి సుతదారగేహమోహం
త్వఘటితఘటనాపటీయసీమాయా
ఈ మాయ ఎంత గొప్పది, గుణ వర్ణ జాతి అనే భేద
రహితుడైన, సుఖ చిత్ స్వరూపుడైన ఆత్మయందు బ్రాహ్మణాదిచాతుర్వర్ణాది
రూపమగు అహంకారాన్ని, భార్య, భర్త,
కొడుకు, ఇల్లు అనే మోహాలను కలిగిస్తోంది. ఈ
మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది.?
విధిహరహరివిభేదమప్యఖణ్డే
బత విరచయ్య బుధానపి ప్రకామమ్
భ్రమయతి హరిహరభేదభావా
త్వఘటితఘటనాపటీయసీమాయా
అఖండస్వరూపమైన బ్రహ్మంలో బ్రహ్మవిష్ణుశివ ఇత్యాది భేధములను నిర్మించి, బుధజన శ్రేష్ఠులు ఐన వారిని కూడా శివవిష్ణుభేదబుద్ధులుగా
మార్చి ఆ భ్రమను కల్పిస్తూ ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత
సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది కదా!
ఇతి శ్రీమచ్ఛంకరభగవత్పాద విరచిత మాయా పఞ్చకమ్
No comments:
Post a Comment