Thursday, February 7, 2013

తోటకాష్టకం

శ్రీ గురుభ్యోన్నమః

తోటకాష్టకం

విధితాఖిలశాస్త్రసుధాజలధే! మహితోపనిషత్ కథితార్థనిధే!
హృదయే కలయే విమలం చరణం! భవ శంకర దేశిక మే శరణమ్!!

కరుణావరుణాలయ పాలయ మాం! భవసాగరదుఃఖ విదూనహృదమ్!
రచయాఖిలదర్శనతత్త్వవిదం! భవ శంకర దేశిక మే శరణమ్!!

భవతా జనతా సుహితా భవితా! నిజబోధవిచారణ చారుమతే!
కలయేశ్వర జీవవివేక విదం! భవ శంకర దేశిక మే శరణమ్!!

భవ ఏవ భవానితి మే నితరాం! సమజాయత చేతసి కౌతుకితా!
మమ వారయ మోహమహాజలధిం! భవ శంకర దేశిక మే శరణమ్!!

సుకృతేధికృతే బహుధా భవతో !భవితా సమదర్శనలాలసతా!
అతిదీనమిమం పరిపాలయ మాం! భవ శంకర దేశిక మే శరణమ్!!

జగతీమవితుం కలితాకృతయో! విచరంతి మహామహసశ్ఛలతః!
అహిమాంశు రివాత్ర విభాసిగురో! భవ శంకర దేశిక మే శరణమ్!!

గురుపుంగవ పుంగవకేతన తే! సమతామయతాం నహి కోపి సుధీ:!
శరణాగతవత్సల తత్త్వనిధే! భవ శంకర దేశిక మే శరణమ్!!

విదితా మయా విశదైకకలా! కించన కాంచనమస్తి గురోః!
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం! భవ శంకర దేశిక మే శరణమ్!!

స్తోత్రమును శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరభగవత్పాదుల శిష్యులు శ్రీశ్రీశ్రీ తోటకాచార్యుల కృతము. వారి పూర్వాశ్రమ నామము "గిరి". తోటకవృత్తములో ఈ స్తోత్రమును చేసినందుకు వారి పేరు తోటకాచార్యులుగా మారినదిఅని పెద్దలు అంటారు. తోటక వృత్తంలో ప్రతి పాదము / వాక్యము నందు ౧౨ (12) అక్షరములు ఉంటాయి.
________________________
జయ జయ శంకర హర హర శంకర

Wednesday, February 6, 2013

శివోహమ్

నిర్వాణషట్కమ్


మనోబుద్ధ్యహఙ్కారచిత్తాని నాహం
నశ్రోత్రం జిహ్వా ఘ్రాణనేత్రమ్
నచ వ్యోమ భూమిర్న తేజో వాయుః
చిదానన్దరూపః శివోహం శివోహమ్

మనస్సు, బుద్ధి, అహం స్ఫురణ, చిత్తము - ఇవి నేను కాను, చెవులు, జిహ్వ, ఘ్రాణము, కన్నులు - ఇవి నేను కాను, ఆకాశము, భూమి, తేజస్సు, వాయు జలములు - ఇవి నేను కాను, నేను కర్మేంద్రియములు, జ్ఙానేంద్రియములు, పంచభూతములకు అతీతుడనైన చిదానంద స్వరూపుడగు శివుడను, నేనే శివుడను.

అహం ప్రాణసఙ్గోన వై పఞ్చవాయుః
వా సప్తధాతుర్న వా పఞ్చకోశః
వాక్ పాణిపాదౌ చోపస్థపాయూ
చిదానన్దరూపః శివోహం శివోహమ్

నేను ప్రాణమును కాను,ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదానములను పంచ ప్రాణములనూ కాను, రక్తము, మాంసము, మేధ, అస్థి, మజ్జ, రసము, శుక్రము లను సప్త ధాతువులనూ కాను, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఙానమయ, ఆనందమయములనబడు పంచ కోశములూ కాను, వాక్కు, చేతులు, పాదములు, నేను కాదు, పాయూపస్థలు నేను కాదు, అతీతుడనైన చిదానంద స్వరూపుడగు శివుడను, నేనే శివుడను.

పుణ్యం పాపం సౌఖ్యం దుఃఖం
మన్త్రో తీర్థం వేదా యజ్ఙాః
అహం భోజనం నైవ భోజ్యం భోక్తా
చిదానన్దరూపః శివోహం శివోహమ్

నాకు పుణ్య పాపములు లేవు, సుఖ దుఖములు లేవు, మంత్ర ములేదు, తీర్థమూలేదు, వేదము లేదు యజ్ఙము లేదు (ఆత్మస్వరూపము నెరిగిన బ్రహ్మ జ్ఙానికి విధి నిషేధములు చేయవలసిన కర్మలు లేవు) భోజనము, భోక్త కంటే నేను వేరు. అతీతుడనైన చిదానంద స్వరూపుడగు శివుడను, నేనే శివుడను.

మే ద్వేషరాగౌ మే లోభ మోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్య భావః
ధర్మో చార్థో కామో మోక్షః
చిదానన్దరూపః శివోహం శివోహమ్

నాకు రాగ ద్వేషములు లేవు, లోభమోహములు లేవు, మదమాత్సర్యములూ లేవు, ధర్మార్థ కామ మోక్షములను చతుర్విధ పురుషార్థములు లేవు. అతీతుడనైన చిదానంద స్వరూపుడగు శివుడను, నేనే శివుడను.

మృత్యుర్న శఙ్కా మే జాతిభేదః
పితా నైవ మే నైవ మాతా జన్మ
బన్దుర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానన్దరూపః శివోహం శివోహమ్

మృత్యువు, భయము, జాతి భేదములు నాకు లేవు, నాకు జన్మము లేదు, జన్మనిచ్చిన తల్లి దండ్రులు లేరు, నాకు బంధు మిత్రులు లేరు, నాకు గురువు లేడు, శిష్యుడును లేడు. అతీతుడనైన చిదానంద స్వరూపుడగు శివుడను, నేనే శివుడను.

అహం నిర్వికల్పో నిరాకారరూపో
విభుత్వాచ్చ సర్వత్ర సర్వేన్ద్రియాణామ్
వా బన్ధనం నైవ ముక్తిర్న బన్ధః
చిదానన్దరూపః శివోహం శివోహమ్

నేను వికల్పములు లేనివాడను, ఆకారము లేనివాడను, సర్వవ్యాప్తి పొందుటవలన ఆకారము లేనివాడను, ఏ ఇంద్రియములతోను సంబంధములేని వాడను, నాకు బంధనము లేదు, మోక్షము లేదు, నేను సచ్చిదానంద స్వరూపుడను, అతీతుడనైన చిదానంద స్వరూపుడగు శివుడను, నేనే శివుడను.

ఇతి శ్రీ శఙ్కరభగవత్పూజ్యపాద విరచిత నిర్వాణషట్కమ్
ఇది శ్రీ శంకర భగవత్పాదులు రచించిన నిర్వాణషట్కము


~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर
https://groups.google.com/group/satsangamu